తిరుమల అలిపిరి వద్ద మరోసారి చిరుత కలకలం

 కలియుగం ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత చిరుత పులి కలకలం రేపుతుంది. అలిపిరి నడక మార్గంలో మరో సారి చిరుత దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. 2024, మార్చి 25,26 తేదీలలో ట్రాప్ కెమెరాకు చిరుత దృశ్యాలు చిక్కాయి. రాత్రి సమయంలో అలిపిరి నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్టు అధికారులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని అలర్ట్ చేశారు.  

అలిపిరి మార్గంలో రాత్రి సమయంలో భక్తలను గుంపులు గుంపులుగా అనుమతిస్తున్నారు అధికారులు. కర్రలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో భక్తులను తిరుమల కొండ పైకి పంపుతున్నారు. రాత్రి సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు మాత్రమే అలిపిరి మార్గంలో భక్తులకు అనుమతి ఇస్తున్నట్టు టీటీడీ  వెల్లడించింది. మద్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ళ లోపు పిల్లల అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది.