దేశంలో భారీగా రిక‌వ‌రీ కేసులు..అంత‌కు మించి న‌మోదవుతున్న క‌రోనా కొత్త కేసులు

దేశంలో భారీగా రిక‌వ‌రీ కేసులు..అంత‌కు మించి న‌మోదవుతున్న క‌రోనా కొత్త కేసులు

దేశంలో భారీస్థాయిలో రోజుకి 70వేల‌కు పైగా క‌రోనా వైర‌స్ రిక‌వ‌రీ కేసులు న‌మోదవుతున్నా..అంత‌కు మించి కొత్త క‌రోనా కేసులు న‌మోదవుతున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 5.6మందికి క‌రోనా టెస్ట్ లు చేసిన‌ట్లు ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. అంతేకాదు క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య‌రోజు రోజుకి పెరిగిన‌ట్లు కేంద్ర గ‌ణాంకాలు చెబుతున్నాయి.

మే నెల నుంచి రోజుకి 50వేల మందికి పైగా వైర‌స్ నుంచి కోలుకోగా..అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 36 ల‌క్ష‌ల‌మంది బాధితులకు క‌రోనా త‌గ్గిన‌ట్లు తేలింది. ఇక‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య 3.8 రెట్లు అధికంగా ఉందని తెలిపింది.