జూలై 2 నుంచి 8 వరకు వార ఫలాలు

జూలై 2 నుంచి 8 వరకు వార ఫలాలు

మేషం : నూతన ఉద్యోగాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలకు కార్యరూపం. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్య కార్యక్రమాలలో విజయం. కొన్ని  నిర్ణయాలు మిమ్మల్నే ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులు కొన్ని సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు.

సింహం : ముఖ్య కార్యక్రమాలు పూర్తి. ఆలోచనలకు కార్యరూపం. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. యుక్తితో కార్యాలు సాధిస్తారు. కోర్టు కేసులలో పురోగతి. పలుకుబడి కలిగిన వారి పరిచయం. వ్యాపారులకు ప్రోత్సాహం. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు మెరుగైన పరిస్థితులు.

 ధనుస్సు : కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆదాయం మెరుగుపడే అవకాశం. కొత్త వ్యక్తుల పరిచయం. సమాజంలో విశేష గౌరవం. మీ ఊహలు నిజం చేసుకుంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ముఖ్య విషయాలు తెలుస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సమస్యల నుంచి విముక్తి.

వృషభం : ఆదాయం క్రమేపీ మెరుగ్గా ఉంటుంది. అప్పగించిన ఎటువంటి బాధ్యతలైనా పూర్తి చేసే వరకు విశ్రమించరు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు. వ్యాపార విస్తరణ యత్నాలు సానుకూలం. ఉద్యోగులకు విధుల్లో ఉన్నతాధికారుల సాయం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు అనుకూల వాతావరణం. వారారంభంలో శుభవార్తలు. వాహనసౌఖ్యం.

కన్య : అనుకున్న కార్యక్రమాలు కొంత జాప్యమైనా పూర్తి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కే సూచనలు. ఆస్తుల వ్యవహారాలలో ప్రతిష్టంభన తొలగుతుంది. ఆదాయం రెండుమూడు విధాలుగా దక్కవచ్చు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు ఆలస్యంగా పెట్టుబడులు. ఉద్యోగులకు విధుల్లో సమస్యలు తీరవచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరమైన కాలం.

మకరం : ఎంతటి వారినైనా మాటలతో  ఆకట్టుకుంటారు. ఊహించని రీతిలో ఆదాయం. ఒక సంఘటన మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక ముఖ్య వ్యక్తి పరిచయం ఆశ్చర్యపరుస్తుంది. భూములు, ఇళ్లు కొనే యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార విస్తరణ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు.

మిథునం : పరిచయాలు విస్తృతం. ఆదాయం గతం కంటే మెరుగవుతుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నిర్ణయాలలో పొరపాట్లు  సరిదిద్దుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వాహనాలు, భూములు కొంటారు. కష్టానికి తగిన ఫలితం. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రశాంతంగా కొనసాగుతారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల యత్నాలు సఫలం.

తుల : నూతనంగా చేపట్టిన కార్యాలు విజయవంతం. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వాహనాలు, భూములు కొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారి సాయపడతారు. వ్యాపారులకు తగిన లాభాలు. ఉద్యోగులు లక్ష్యాలు  సాధిస్తారు. కళాకారులు, పరిశోధకులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

కుంభం : కొత్త కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు. పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సానుకూలం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు సంతోషం కలిగించే సమాచారం. రాజకీయవేత్తలు, కళాకారులకు కలిసివచ్చే సమయం.

 కర్కాటకం : రుణయత్నాలు ముమ్మరం. అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. నిర్ణయాల్లో మార్పులు. మనోనిబ్బరంతో ముందుకు సాగాలి. వాహనాలు, భూముల కొనుగోలులో ఆటంకాలు. వ్యాపారులు పెట్టుబడుల్లో తొందరపడొద్దు. ఉద్యోగులకు పనిభారం. కళాకారులు, క్రీడాకారులకు ఒడిదుడుకులు. వారం మధ్యలో  శుభవార్తలు. వాహనసౌఖ్యం. స్వల్ప ధనలబ్ధి.

వృశ్చికం : భూములు, వాహనాలు కొనడంలో అడ్డంకులు తొలగుతాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలు. శత్రువులు స్నేహితులుగా మారతారు. ఎంతోకాలంగా ఉన్న వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు క్రమేపీ అనుకూలత.

 మీనం : ముఖ్యమైన కార్యాలు పూర్తి. ఆదాయం మెరుగు పడుతుంది. రుణబాధల నుంచి విముక్తి. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. సమాజంలో విశేష గౌరవం. వ్యతిరేకించిన వారే ప్రశంసిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలపై దృష్టి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పనిభారం తగ్గవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు తగిన గుర్తింపు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400