శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ రిలీజ్​ చేయాలి: కిమ్స్ ముందు వివిధ సంఘాల ఆందోళన

సికింద్రాబాద్, లుగు: పుష్ప–-2 సినిమా బెనిఫిట్​షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని పలు సంఘాల నాయకులు సోమవారం సికింద్రాబాద్​కిమ్స్​ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. చికిత్స పొందుతున్న శ్రీతేజ్​ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు హెల్త్​ బులిటెన్​రిలీజ్​చేయాలని కోరారు.

అల్లు అర్జున్ ఒక్కరాత్రి జైల్లో ఉంటే, తర్వాత రోజు ఆయన ఇంటికి క్యూ కట్టిన సెలబ్రెటీలకు చనిపోయిన రేవతి కుటుంబం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, పీఓడబ్ల్యూ సంధ్య, ప్రజా సంఘాల నాయకులు శ్రీతేజ్ ను చూసి డాక్టర్లతో మాట్లాడారు. భైరి రమేశ్, చిప్పల నర్సింగరావు, బ్యాగరి వెంకటస్వామి, నాయకోటి రవికాంత్, ఆనంద్, మహేందర్, నితిన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.