క్రికెటర్లకు న్యాయం చేయాలి

పాలమూరు, వెలుగు: క్రికెట్ లో తెలంగాణ జిల్లాల క్రీడాకారులకు న్యాయం చేయాలని తెలంగాణ డిస్ట్రిక్ట్  క్రికెట్  అసోసియేషన్(టీడీసీఏ) అధ్యక్షులు, శాట్ మాజీ చైర్మన్  అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్  చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బీ గెస్ట్​ హౌస్​లో​ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జిల్లాల్లోని క్రికెట్  క్రీడాకారులను హెచ్ సీఏ పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు 216 క్లబ్​లు ఉంటే జిల్లాలకు కేవలం 8 జట్లు ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

 కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్త అసోసియేషన్  ఏర్పాటు, గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మహారాష్ట్రలో మూడు, గుజరాత్ లో రెండు క్రికెట్ సంఘాలు ఉన్నాయని, తెలంగాణ జిల్లాలకు కూడా ప్రత్యేక క్రికెట్  అసోసియేషన్  ఉండాలని కోరారు. జిల్లాల క్రీడాకారులకు న్యాయం చేసేందుకు ధర్నాలు, ఆందోళనలు చేపడుతామన్నారు. హైదరాబాద్  క్రికెట్  అసోసియేషన్  అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందని, దీనిపై విచారణ చేయించాలని సీఎంను కోరారు. రఘువర్ధన్ రెడ్డి, నవీన్, ఎండీ. రియాజుద్దీన్, రాంచందర్, నాగిరెడ్డి, నవాజ్, ఎండీ. రశీద్, వెంకటరమణ, సంతోష్ కుమార్  పాల్గొన్నారు.