త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేని కేండిడేట్లను పోటీలో నిలపాలి. డెవలప్‌మెంట్‌కు కట్టుబడి ఉండి, ఆదర్శంగా ఉండే వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలనూ కోరుతున్నా. స్టేట్ లెవెల్ సర్వీసెస్ ద్వారా ఎంపికైన వారిని మున్సిపాల్టీల్లోని కీలక పోస్టుల్లో నియమిస్తాం. రాష్ట్రంలోని వివిధ లోకల్ బాడీస్‌కు వారిని ట్రాన్స్‌ఫర్ చేస్తాం. చాలా రాష్ట్రాల్లో కింది స్థాయిలో జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పోటీకి దూరంగా ఉంటున్నాయి. దీనిపై చర్చించి, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఈ పద్ధతిని అమలు చేస్తాం. అన్ని సిటీల్లో మౌలిక సదుపాయాలను డెవలప్ చేయడానికి మాస్టర్‌ప్లాన్ రెడీ చేస్తాం.
