శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్‌‌‌‌‌‌‌‌ : రాములు

లమూరు వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఉన్నారని ప్రజలకు నమ్మకం కల్పించడమే ఫ్లాగ్ మార్చ్ ప్రధాన లక్ష్యమని ఎఎస్పీ రాములు అన్నారు.  శనివారం  జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ఐటీబీపీ డిప్యూటీ కమాండెంట్ టీంతో  కలిసి ఎఎస్పీ రాములు జిల్లా కేంద్రంలో  పోలీసులు కవాతు (ఫ్లాగ్ మార్చ్) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఎస్పీ రాములు మాట్లాడుతూ..  ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా, శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడినా నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.  

శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగినా ప్రజల్లో భరోసా, ధైర్యం కల్పించడం లక్ష్యంగా ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌ మార్చ్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పయ్య, సిబ్బంది పాల్గొన్నారు.