జైనూర్, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వెంటనే చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కనక వెంకటేశ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన టీపీటీఎఫ్ మహాసభలో ఆయన పాల్గొని ఆసిఫాబాద్ జిల్లా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న టీచర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అరకొర వసతులతో విద్యాసేవలు నామమాత్రంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవోను వెంటనే రద్దు చేసి ఏజెన్సీ ఆధారంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెట్లో బదిలీలు చెప్పటాలని, ఏజెన్సీ డీఎస్సీ పోస్టుల భర్తీ చేయాలని, అర్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.