వినాయకుడి లడ్డు దక్కించుకున్న ముస్లింలు

  • దంపతులను మెచ్చుకుంటూ ట్వీట్ చేసిన కేటీఆర్

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్‌‌ జిల్లా కాగజ్‌‌నగర్‌‌ మండలం భట్​పల్లి గ్రామపంచాయతీలో శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను ముస్లిం దంపతులు దక్కించుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన వేలంపాటలో అదే కాలనీకి చెందిన అఫ్జల్–-ముస్కాన్ దంపతులు పాల్గొని రూ.13,216 దక్కించుకున్నారు.

మతసామరస్యాన్ని చాటిన వారిని పలువురు అభినందించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అఫ్జల్ దంపతులను మెచ్చుకుంటూ ట్విట్టర్​లో పోస్ట్ పెట్టారు. ‘గంగా జమునా తహజీబ్’ అంటూ ప్రశంసించారు. ఇదీ తెలంగాణ సంస్కృతి అని అన్నారు.