అంటే అన్నారంటారు కానీ.. హైదరాబాద్ లో ఒక్క మంచి బార్ లేదా అండీ..

అంటే అన్నారంటారు కానీ.. హైదరాబాద్ లో ఒక్క మంచి బార్ లేదా అండీ..

హైదరాబాద్ విశ్వనగరం అంటున్నాం.. న్యూయార్క్ లో ఉన్నామా అంటూ సెలబ్రిటీలు కీర్తిస్తున్నారు. ఇది ఓ యాంగిల్ అయితే.. మరో యాంగిల్ ఏంటో తెలుసా.. తెలంగాణ మందు ఏరులై పారుతోంది.. లిక్కర్ డబ్బుతోనే కేసీఆర్ సర్కార్ నడుస్తుంది అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. మందుబాబుల వెర్షన్ ఏంటో తెలుసా.. హైదరాబాద్ లో ఇన్ని బార్లు, పబ్స్ ఉన్నాయి కదా.. ఒక్కటి అంటే ఒక్కటి కూడా బెస్ట్ బార్, పబ్ లేదంట.. అయ్యయ్యో.. ఇవన్నీ మేం అనటం లేదండీ.. అంతర్జాతీయ సంస్థలు చేసిన సర్వేలో వచ్చింది.

హైదరాబాద్ లో పబ్బుల డబ్బు అని.. గల్లీ గల్లీలో బార్లు అని గగ్గోలు పెడుతున్నా.. ఒక్కటి కూడా మంచి బారు, పబ్ లేదని మందుబాబులు చాలా ఫీలవుతున్నారంట. ఎస్టీండ్ అకాడమీ అనే సంస్థ ఆసియా దేశాల్లోని బెస్ట్ 50 బార్లు ఏంటీ అని సర్వే చేస్తే.. ఇండియాలో కేవలం మూడు అంటే మూడు ఉన్నాయని చెప్పారంట. ఇక హైదరాబాద్ బార్లు, పబ్స్ అయితే బెస్ట్ 50లో కూడా చోటు దక్కించుకోలేదు.

ఏషియా దేశాల్లోని బెస్ట్ బారు ఏంటీ అంటే హాంగ్ కాంగ్ లోని కోవా అంట. అద్భుతం అంట.. సింగపూర్ లోని జిగ్గర్ అండ్ పోనీ బారు సెకండ్ ర్యాంక్ లో ఉంది. బ్యాంకాంగ్ లోని బీకెకె సోషల్ క్లబ్ మూడో స్థానంలో ఉంది. టోక్యోలోని బెన్ ఫిడిచ్ బార్ నాలుగో స్థానంలో ఉంది. సియోల్ లోని జెస్ట్ బారు ఐదో స్థానంలో ఉంది.

ఇండియా విషయానికి వస్తే ముంబైలోని సైడ్ కార్ అనే బారు 18వ ప్లేస్ లో ఉంది. అదే ముంబైలోని బాంబే క్యాంటిన్ బారు 35వ ర్యాంక్ సాధించింది. బెంగళూరులోని కోపిటాస్ బారు 38వ స్థానంలో ఉంది.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఆసియా దేశాల్లోని బెస్ట్ 50 బార్లలో చోటు దక్కించుకోలేకపోయింది. అంటే హైదరాబాద్ మందు ప్రియులకు ప్రస్తుతం ఉన్న బార్లు ఏ మాత్రం కిక్కు ఇవ్వటం లేదని స్పష్టం అయ్యింది. అసలు బారు ఎలా ఉండాలో కూడా ఆయా బారు యజమానులకు తెలియదా ఏంటీ అంటున్నారు నెటిజన్లు.

అంటే అన్నారంటారు కానీ.. విశ్వనగరంలో ఒక్క మంచి బారు కూడా ఉండదా అండీ అంటూ నెటిజన్లు డిఫరెంట్ గా.. ఫన్నీగా స్పందిస్తున్నారు. వచ్చే ఏడాది చేసే సర్వేలో అయినా బెస్ట్ 50 బార్లలో.. ఒక్కటైనా హైదరాబాద్ నుంచి చోటు దక్కించుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెబుదామా..