ఆశా కార్యకర్తలకు రూ.18వేలు ఇవ్వాలి

చేవెళ్ల, వెలుగు: ఆశా కార్యకర్తలకు రూ.18వేలు నిర్ణయించి ఇవ్వడమే కాకుండా పీఎఫ్, ఈఎస్ఐ  కల్పించాలని ఆశా వర్కర్స్ యూనియన్ చేవెళ్ల మండల అధ్యక్ష, కార్యదర్శులు అన్నపూర్ణ, విజయ లక్ష్మి కోరారు. శుక్రవారం ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ చేవెళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు క్యాంపు ఆఫీసులో వినతి పత్రం అందించిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్  ఇచ్చిన  ఫిక్స్ డ్ వేతన హామీని నెరవేర్చాలని కోరారు. ఆశ కార్యకర్తలు ధనలక్ష్మి, సుగుణ, హేమలత, గీత, లావణ్య, బాలమణి తదితరులు ఉన్నారు.