Asghar Afghan: ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడాలంటే ఆస్ట్రేలియాకు భయం: అస్గర్ ఆఫ్ఘన్

అఫ్గానిస్థాన్‌ దేశం పూర్తిగా తాలిబన్ల వశం అయిన విషయం తెలిసిందే. పురుషుల క్రికెట్ జట్టును మాత్రమే ఆడేందుకు అనుమతిస్తామని, మహిళా జట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని వారు స్పష్టం చేశారు. తాలిబన్ల నిర్ణయంతో పురుషుల క్రికెట్ జట్టు భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది. రెండేళ్లుగా మహిళలకు సంబంధించిన మానవ హక్కుల కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తో ఆఫ్ఘనిస్తాన్‌ తో సిరీస్ ను పలుమార్లు రద్దు చేసింది. ఈ విషయంపై తాజాగా ఆఫ్ఘనిస్తాన్ మాజీ ప్లేయర్ అస్గర్ ఆఫ్ఘన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో  లెజెండ్స్ లీగ్ క్రికెట్ సందర్భంగా  మాట్లాడాడు. మేము క్రికెట్ ప్రారంభించిన రోజుల్లో ప్రత్యర్థులతో ఆడాలంటే భయం వేసేది. చిన్న జట్లపై ఆడేటప్పుడు కూడా మాపై ఒత్తిడి ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాపైనే ఒత్తిడి ఉంది. ఆస్ట్రేలియా మాపై ఆడితే వారు ఓడిపోతారనే భయం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు చాలా పటిష్టంగా ఉంది. భారత్, ఆస్ట్రేలియా జట్లయినా మమ్మల్ని ఓడించాలంటే అంత ఈజీ కాదు". అని ఈ మాజీ ఆఫ్గన్ బ్యాటర్ చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో రెండు టీ20లు ఆడగా.. వాటిలో ఒక విజయాన్ని నమోదు చేసింది.

ALSO READ | ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్‌: ఆరో స్థానానికి చేరిన పంత్.. టాప్ 10 నుంచి కోహ్లీ ఔట్

రెండేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ అత్యుత్తమ క్రికెట్ ఆడుతుంది. 2023 భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లపై సంచలనాల విజయాలను సాధించింది. ఆస్ట్రేలియాపై గెలిచే మ్యాచ్ లో ఓడిపోయింది. దీంతో తృటిలో సెమీస్ ఫైనల్ అవకాశాలను కోల్పోయింది. ఇక ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఏకంగా సెమీస్ కు చేరుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాపై తొలిసారి వన్డే సిరీస్ గెలుచుకొని సంచలనం సృష్టించింది.