ఒమిక్రాన్ కు భయపడాల్సిన అవసరం లేదు

ఒమిక్రాన్ కు భయపడాల్సిన అవసరం లేదు

 

 

 

ఒమిక్రాన్ కేసు ఢిల్లీలో నమోదు కావడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీలో ప్రవేశించినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని... అయితే మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెప్పారు. ఆఫ్రికా దేశమైన టాంజానియా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్ ఉన్నట్టు తేలింది. ఇప్పటికే ..అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు. 

ఒమిక్రాన్ వైరస్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని  ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. ఇప్పటి వరకు 27 మందిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. వీరిలో 17 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని... మిగిలిన వారు వారికి కాంటాక్టులోకి వచ్చినవారని చెప్పారు. వీరిలో 12 మంది శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామని... వీరిలో ఒకరికి ఒమిక్రాన్ అని తేలిందని తెలిపారు.