US Open 2024: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత సబలెంకా

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో మరో కొత్త ఛాంపియన్ అవతరించింది. 2024 మహిళల సింగిల్స్ విజేతగా అరీనా సబలెంకా నిలిచింది. శనివారం (సెప్టెంబర్ 7) రాత్రి జరిగిన ఫైనల్లో సబలెంకా 7-5, 7-5 తేడాతో  అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులాను వరుస సెట్లలో ఓడించింది. సబలెంకాకి ఇదే తొలి యూఎస్ ఓపెన్  టైటిల్ కావడం విశేషం. 2023 యూఎస్ ఓపెన్ ఫైనల్ కు చేరుకున్న ఆమె ఫైనల్లో కోకో గాఫ్ చేతిలో ఓడిపోయింది. అయితే ఈ ఏడాది మాత్రం అంచనాలను అందుకుంటూ టైటిల్ గెలుచుకుంది. 

Also Read :- ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ రిటైర్మెంట్

సబలెంకాకు ఈ ఏడాది రెండో గ్రాండ్ స్లామ్ కాగా.. కెరీర్ లో మూడో గ్రాండ్ స్లామ్. ఇప్పటికే 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్న ఆమె..గ్రాండ్ స్లామ్ లో తన రికార్డ్ ను 18-1 తేడాతో ముగించింది. ఫ్రెంచ్ ఓపెన్ లో ఆండ్రీవ చేతిలో ఓడిపోయిన సబలెంక.. వింబుల్డన్ ట్రోఫీకి దూరమైంది. మరోవైపు టోర్నీ అంతటా అద్భుతంగా ఆడిన అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులాకు తుది పోరులో నిరాశ తప్పలేదు. తీవ్ర పోరాటం చేసినా.. సబలెంకా  కీలక దశలో ఒత్తిడి జయించలేకపోయింది.