Aryan Bangar: జన్మ ధన్యమైందట.. అమ్మాయిగా మారిన భారత క్రికెటర్ కొడుకు

భారత క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ సెక్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్జరీ చేయించుకున్నాడు. ఆర్యన్ బంగర్ తన పేరును అనయ బంగర్ గా మార్చుకున్నాడు. 23 ఏళ్ల ఆర్యన్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకున్నాడు. తన 10 నెలల హార్మోన్ల పరివర్తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.  ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. ఇందులో భాగంగా తాను అబ్బాయి నుండి అమ్మాయిగా ఎలా మారాడో చెప్పాడు.

తన నిర్ణయంతో చాలా సంతృప్తిగా ఉన్నానంటూ ఆనయ బంగర్ చెప్పుకొచ్చింది. ఆర్యన్ బంగర్ చిన్నప్పటి నుంచి తన తండ్రిలాగే క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. ఎంతో ప్రాక్టీస్ చేసిన అతను  లీసెస్టర్‌షైర్‌లోని హింక్లీ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా..అనయ "శారీరకంగా బలాన్ని కోల్పోయి సంతోషంతో ఉన్నా. నేను వేసే ప్రతీ అడుగు నాకు బాగా నచ్చుతోంది. నా శరీరం పూర్తిగా మారిపోయి నాలోని అసంతృప్తి క్రమక్రమంగా తగ్గుతోంది".అని చెప్పుకొచ్చింది. 

ALSO READ | ఇండియాx మలేసియా : ఇవాళా నుంచి విమెన్స్‌‌ హాకీ ఆసియా చాంపియన్స్‌‌ ట్రోఫీ 

51 ఏళ్ల సంజయ్ బంగర్ 2001-2004 మధ్య కాలంలో భారత్​ తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. గతంలో జాతీయ జట్టు బ్యాటింగ్​ కోచ్​గా పనిచేశాడు. రవిశాస్త్రి టీమ్​ఇండియా డైరెక్టర్​గా ఉన్న సమయంలో 2014 నుంచి 2019 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగాడు. 2021 ఐపీఎల్ సీజన్ లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూర్ జట్టు​ బ్యాటింగ్​ సలహాదారుగా ఉన్నాడు.