ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాల్లేవు

ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాల్లేవు

క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్-28న బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఇవాళ (శనివారం)బాంబే హైకోర్టు విడుదల చేసింది.14 పేజీల ఉత్తర్వులో..ర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు సహ నిందితులు అర్బాజ్ మర్చంట్,మున్మున్ ధమేచాపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్  కింద నేరానికి పాల్పడ్డారనడానికి సంబంధించి ఎలాంటి ప్రాథమిక సాక్ష్యం లేదని జస్టిస్ నితిన్ సాంబ్రే తెలిపారు. ఈ ఇష్యూపై ప్రతివాది రికార్డు చేసిన మెటీరియల్‌కు సంబంధించి..ఈ కోర్టు దరఖాస్తుదారులకు వ్యతిరేకంగా ఎటువంటి సానుకూల సాక్ష్యాలను గుర్తించలేదు అని ఆ ఉత్తర్వులో కోర్టు పేర్కొంది. నిందితులు క్రూయిజ్‌లో ప్రయాణిస్తున్నందున, నిందితులపై సెక్షన్ 29 నేరాన్ని ప్రయోగించడానికి కారణం కాకూడదని కోర్టు తెలిపింది. దరఖాస్తుదారులపై కుట్ర కేసును రుజువు చేయడానికి సాక్ష్యాధారాల రూపంలో ప్రాథమిక అంశాలు ఉండాలనే వాస్తవాన్ని ఈ  కోర్టు సున్నితంగా తెలుసుకోవాల్సిన అవసరముందంది.

అక్టోబర్-2న ముంబైలో కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది.  నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (NCB) అధికారులు అక్టోబర్-2 అర్ధరాత్రి దాడులు జరిపి అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు.