పంజాబ్‌లో ఫేక్ కేజ్రీవాల్ తిరుగుతుండు

పంజాబ్‌లో ఫేక్  కేజ్రీవాల్ తిరుగుతుండు

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే... అమ్మాయిలకు ఆర్థిక చేయూత అందిస్తామన్నారు ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్. 18 ఏళ్లు నిండిన ప్రతీ అమ్మాయికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తామన్నారు ఒక ఇంట్లో ముగ్గురు అమ్మాయిలున్నా... తలో వెయ్యి ఇస్తామని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమం కాబోతుందన్నారు. పంజాబ్ లో ఫేక్ కేజ్రీవాల్ సంచరిస్తున్నాడని... తాను ఇచ్చిన హామీలనే అతనూ ఇస్తున్నాడని నవ్ జోత్ సింగ్ సిద్దూపై సెటైర్లేశారు.