లక్షలు తెచ్చేఉద్యోగం వద్దనుకుని.. ఈ పని చేస్తున్నాడు

ఇంగ్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టి, పెరిగాడు.పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాడు.లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం సంపాదించాడు. కానీ.. అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు.అందుకే ‘సంపాదన కంటే సంతృప్తే ముఖ్యం’ అనుకుని యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అందుకే ఇప్పుడు అతని వీడియోలను ప్రపంచమంతా చూస్తోంది.  ఆ వీడియోలు లక్షల మంది ఫాలోవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సంపాదించి పెట్టాయి. 

అరుణ్ రూపేష్ మైని 1995 అక్టోబర్ 24న ఇంగ్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టాడు. అక్కడే చదువుకున్నాడు. ఇతను భారతీయ మూలాలు ఉన్నవాడు. అందుకే చిన్నప్పుడు రెండు స్కూల్స్​లో చదువుకునేవాడు. వారమంతా ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియంలో చదువు చెప్పే రెగ్యులర్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి, వీకెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందీ నేర్చుకునేందుకు మరో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లేవాడు. అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చిన్నప్పటినుంచి వీడియో గేమ్స్ ఆడడం అంటే ఇష్టం. అందుకే ఖాళీ దొరికినప్పుడల్లా గేమ్స్ ఆడుతుండే వాడు. అలా ఆడేటప్పుడు గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి మూమెంట్స్ వస్తే... కెమెరాతో రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవాడు. అలా వీడియోలు తీయడం అలవాటైంది.  అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి14 ఏండ్ల వయసు ఉన్నప్పుడు అతని అన్న ‘జెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఈ బ్లేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనిచ్చాడు. 

అతను వాడిన మొదటి స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదే. అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టెక్నాలజీ మీద కూడా ఇష్టం ఉండేది. అందుకే ఆ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అందులోని ఫీచర్ల గురించి ఒక వీడియో చేశాడు. ఆ వీడియోని యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని డిసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. అందుకోసం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిబాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో ఒక ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. వాస్తవానికి అప్పట్లో అంటే13 ఏండ్ల క్రితం యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసేవాళ్లు చాలా తక్కువ. అయినా.. తన వంతు ప్రయత్నం చేశాడు. ఆ వీడియోతో యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దానికి అతను ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దాంతో మరిన్ని వీడియోలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ తర్వాత తన ట్రైపాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివ్యూ, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయడంపై వీడియోలు చేశాడు. వాటికి అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో గేమింగ్ వీడియోలు, గాడ్జెట్స్ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 

ఉద్యోగం మానేసి...

అరుణ్ ఒకవైపు వీడియోలు చేస్తూనే చదువు పూర్తి చేశాడు. యూకేలోని వార్విక్ యూనివర్సిటీలోని ఎకనామిక్స్ డిపార్ట్​మెంట్​లో చదువుకున్నాడు. చదువుకునేటప్పుడే లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అకౌంటింగ్ సంస్థ ‘ప్రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ కూపర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ చేశాడు. అది అతనికి చాలా బోర్​ అనిపించింది. అప్పుడు డిసైడ్​ అయ్యాడు ఉద్యోగం చేయకూడదని. ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ చేస్తున్నప్పుడు కూడా సాయంత్రం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఇంటికి రాగానే వీడియోలు చేసేవాడు. ఇష్టం లేకుండా చేసినప్పటికీ ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిపోగానే అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంట్రీ- లెవల్ ఉద్యోగం వచ్చింది. అప్పట్లోనే అతని జీతం 44,285 యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లు. అంత జీతం ఇస్తామన్నా ఆ ఉద్యోగం చేయనని చెప్పేశాడు. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే తన సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెతుక్కున్నాడు. 

గాడ్జెట్స్ రివ్యూలు 

అరుణ్ మొదట్లో గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ రివ్యూలు, వాటిలోని ఫీచర్ల మీదే ఎక్కువ వీడియోలు చేసేవాడు. ఆ తర్వాత ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫాలోయింగ్ పెరగడంతో ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కార్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు.. ఇలా అన్నింటి  రివ్యూలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కొత్తగా, డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండే అన్ని గాడ్జెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రివ్యూ చేస్తున్నాడు. 2015లో మొదటి వైరల్ వీడియో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేశాడు. ఒక రిఫ్లెక్టివ్ మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పిరమిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారుచేసి, స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పెడితే.. అది తాత్కాలికంగా త్రీడీ హోలోగ్రామ్ ప్రొజెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా పనిచేస్తుంది. అది ఎలా చేయాలో చెప్తూ ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఒక వీడియో చేశాడు. అది బాగా వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. అప్పటినుంచి వీడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వ్యూస్ పెరగడం మొదలైంది. అప్పట్లో ఈ వీడియో గురించి కొన్ని న్యూస్ ఛానెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాయి. ఇప్పటికీ అతని ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిన వీడియోల్లో ఇది రెండోది. 

పదమూడేండ్ల ప్రయాణం.. 

అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక నెల లేదా ఏడాదిలో సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాలేదు. సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చాలా ఏండ్లు కష్టపడ్డాడు. ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిబాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని 2011లో పెట్టాడు. ఇప్పటికి ఛానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 18.5 మిలియన్ల సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. 1,680కి పైగా వీడియోలు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. వాటిలో ఎనిమిది వీడియోలకు 20 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇక షార్ట్ వీడియోల విషయానికి వస్తే.. ఒక వీడియోకు ఏకంగా104 మిలియన్ల వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. చాలా వీడియోలకు 50 మిలియన్ల వ్యూస్ దాటాయి. అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నాడు. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాడ్స్ నుంచి వచ్చే ఆదాయంతోపాటు బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు.