ఏఐతో ఉద్యోగాలు

ఏఐతో ఉద్యోగాలు

సైబర్‌‌ సెక్యూరిటీ: సైబర్‌‌ సెక్యూరిటీ ఫ్రాడ్స్​ రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఏఐ డెవలప్​ అయితే.. ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డాటా సెక్యూరిటీ, ఎన్‌‌క్రిప్షన్, త్రెట్ ఇంటెలిజెన్స్‌‌లో స్కిల్స్​ పెంచుకుంటే.. అలాంటివాళ్లకు డిమాండ్ ఉంటుంది.

డిజిటల్ మార్కెటింగ్: డేటా ఎనాలసిస్​, అడ్వర్టైజింగ్ ఆప్టిమైజేషన్ లాంటి డిజిటల్ మార్కెటింగ్‌‌లోని కొన్ని విషయాలను ఏఐ ఆటోమేట్ చేయగలిగినప్పటికీ క్రియేటివిటీ కంటెంట్ డెవలప్​మెంట్, స్ట్రాటజీ కోసం హ్యుమన్​ టచ్​ కావాల్సిందే. కాబట్టి ఈ ఉద్యోగాలకు కూడా డిమాండ్​ ఉంటుంది. 

హెల్త్‌‌కేర్: నర్సింగ్, ఫిజికల్ థెరపీ, మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ లాంటి ఉద్యోగాలకు కూడా ఎప్పుడూ డిమాండ్​ ఉంటుంది. ఇవి ఏఐతో భర్తీ చేయడం కుదరదు.  
ఎన్విరాన్​మెంటల్​ సైన్స్​: కంపెనీలు, ప్రభుత్వాలు ఎన్విరాన్​మెంటల్ సైన్స్​ ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. అందువల్ల పునరుత్పాదక శక్తి, వ్యర్థాల నిర్వహణ లాంటి రంగాలు బాగా డెవలప్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ఎడ్యుకేషన్​: ఈ రంగంలో టీచింగ్​ లాంటి ఉద్యోగాలకు వ్యక్తిగత నైపుణ్యాలు, భావోద్వేగ మేథస్సు అవసరం. కాబట్టి వీటికి కూడా డిమాండ్​ బాగా ఉంటుంది.