భారత్ కు అప్పగించం : మా క్లయింట్ నీరవ్ మోడీకి ఎలుకలంటే భయం

భారత్ కు అప్పగించం : మా క్లయింట్ నీరవ్ మోడీకి ఎలుకలంటే భయం

మా క్లయింట్ కి ఎలుకలంటే భయం. భారత్ కు అప్పగిస్తే.. ఆయన్ని తీసుకెళ్లి ముంబైలో ని ఆర్థర్ జైల్లో ఉంచుతారు. అసలే ఆ జైల్లో ఎలుకలు, క్రిమికీటకాలు ఎక్కువగా ఉన్నాయి. సుచీ సుబ్రతా అసలే ఉండదు. ఎక్కడ చూసినా మురుగు నీటి కాల్వలు. అటువంటి జైల్లో మా క్లయింట్ ను ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందంటూ నీరవ్ మోడీ లాయర్లు భారత్ కు చెందిన న్యాయవాదులతో వాదిస్తున్నారు.

నీరవ్ మోడి..! పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు 13వేల కోట్లకు సున్నం పెట్టి లండన్ లో దర్జాగా తలదాచుకుంటున్నాడు.   ఆర్ధిక నేరం కింద భారత న్యాయ వ్యవస్థ నీరవ్ మోడీని ఇండియా కు తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. కానీ ఈ ఆర్ధిక నేరగాడు మాత్రం న్యాయ వ్యవస్థలో ఉన్న లూపోల్స్ ను అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

శుక్రవారం నీరవ్ మోడీని భారత్ అప్పగించాలని అంశంపై వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా నీరవ్ తరుపు డిఫెన్స్ న్యాయవాది క్లైర్ మోంట్‌ గోమేరీ మరియు ప్రాసిక్యూషన్ న్యాయవాది హెలెన్ మాల్కంలను  వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ న్యాయ వాది పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా నీరవ్ మోడీ తరుపు న్యాయవాదులు మాట్లాడుతూ తన క్లయింట్ నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు సిద్ధంగా లేమని, ఎందుకంటే ముంబై ఆర్థర్ జైల్లో కనీస సౌకర్యాలు ఉండవని చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు భారత న్యాయవాదులు మీ క్లయింట్ నీరవ్ మోడీని మాకు అప్పగిస్తే జైల్లో స్పెషల్ బ్యారక్ ఉంచుతామని సూచించారు. ఇరువురి వాదనల అనంతరం కేసును నవంబర్ 7కి వాయిదా వేస్తూ  వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పిచ్చింది.