భారతదేశం దాని సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైనదన్నారు బీజేపీ ఎంపీ హేమామాలిని. లోక్‌సభలో మాట్లాడిన ఆమె.. మన కళ, సంస్కృతి,కళాకారులు దానికి పునాది అన్నారు. ఏ దేశమైనా తన కళాకారులను నిర్లక్ష్యం చేసినా ఆ దేశం వారిచే తిరస్కరింపబడుతుందన్నారు. ప్రస్తుతం కళారంగం, కళాకారులు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు హేమ మాలిని. ఓ కళాకారిణిగా, తాను కళాకారుల గురించి ఆందోళన చెందుతున్నానని ఆమె తెలిపారు.
2017లో, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కళ కళాకారులపై సమాచారాన్ని సేకరించేందుకు నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ పథకాన్ని ప్రారంభించిందన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, వనరుల కొరత కారణంగా ఇది మూసివేశారన్నారు. ఈ పథకాన్ని పూర్తి చేయడానికి అవసరమైన వనరులను అందుబాటులో ఉంచాలని తాను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని బీజేపీ ఎంపీ తెలిపారు.
మా జానపద.. శాస్త్రీయ కళాకారులు, ఇతర కళాకారుల గుర్తింపు ప్రమాదంలో ఉందన్నారు హేమ మాలిని. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. వారి కళను వదిలి జీవనోపాధి కోసం ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. ఈ కళాకారులకు ఆర్థిక సహాయం. పెన్షన్ కోసం ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హేమ మాలిని.
In 2017, Ministry of Culture launched National Mission on Cultural Mapping scheme to collect info on art & artists. As per latest info, this has been closed due to lack of resources. I request Govt to make necessary resources available for completion of this scheme: Hema Malini pic.twitter.com/10Q6iev88J
— ANI (@ANI) March 16, 2022
India is the best across the world due to its culture & cultural heritage. Our art, culture & artists are its base. Any country that has neglected its artists, has only declined. Art sector & artists are facing problems. As an artist,I'm worried for them: BJP MP Hema Malini in LS pic.twitter.com/jAMbyNXaPq
— ANI (@ANI) March 16, 2022
