IND vs SA 3rd T20I: అర్షదీప్ అదరహో.. రెండేళ్లకే బుమ్రా, భువీని వెనక్కి నెట్టాడు

టీ20 క్రికెట్ లో అర్షదీప్ సింగ్ దూసుకెళ్తున్నాడు. అత్యంత నిలకడ చూపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 2022 లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టర్మ్ పేసర్.. చూస్తూ ఉండగానే భారత టాప్ ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలను దాటేశాడు. టీ20 క్రికెట్ లో 92 వికెట్లు తీసి బుమ్రా, భువీలను వెనక్కి నెట్టాడు. దీంతో టీ20 క్రికెట్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా నిలిచాడు. ఓవరాల్ గా ఈ రికార్డ్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది. 96 వికెట్లతో చాహల్ టాప్ లో ఉన్నాడు. 

ALSO READ | Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు

భువనేశ్వర్ కుమార్ 90, జస్ప్రీత్ బుమ్రా 89 వికెట్లు పడగొట్టి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా పర్యటనలో ఈ 25 ఏళ్ళ పేసర్ ఈ ఘనతను సాధించాడు. సెంచూరియన్ వేదికగా బుధవారం (నవంబర్ 13) ముగిసిన మూడో టీ20లో అర్షదీప్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 59 టీ20 మ్యాచ్ లాడిన అర్షదీప్ 8.3 ఎకానమితో 92 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ లో జరగబోయే నాలుగో టీ20లో 5 వికెట్లు తీస్తే 97 వికెట్లతో చాహల్ ను అధిగమించి భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలుస్తాడు. 


టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:

1) యుజ్వేంద్ర చాహల్ - 96

2) అర్ష్‌దీప్ సింగ్ - 92

3) భువనేశ్వర్ కుమార్ - 90

4) జస్ప్రీత్ బుమ్రా - 89