తజిందర్ పాల్ బగ్గాకు అరెస్ట్ వారెంట్

తజిందర్ పాల్ బగ్గాకు అరెస్ట్ వారెంట్

తజిందర్ పాల్ బగ్గాకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మొహాలీ కోర్టు. బగ్గాను అరెస్ట్ చేసి తమ ముందు ప్రవేశపెట్టాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. రెచ్చగొట్టే కామెంట్స్ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో బగ్గాను అదుపులోకి తీసుకోవాలంది కోర్టు. గత నెల ఆప్ నేత బగ్గాపై ఫిర్యాదు చేయటంతో పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న బగ్గా అరెస్ట్ లో నాటకీయ పరిణామాలు చేటు చేసుకున్నాయి. ఢిల్లీలో బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసి మొహాలికి తీసుకెళ్తుండగా మధ్యలోనే హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఎంట్రీ ఇచ్చి బగ్గాను ఢిల్లీకి తీసుకెళ్లారు.  ఢిల్లీలోని అతని నివాసంలో బగ్గాను కలిశారు బీజేవైఎం చీఫ్ తేజస్వి సూర్య. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు తేజస్వి సూర్య. మొహాలీ కోర్టు అరెస్ట్ వారెంట్ పై స్పందించారు బగ్గా తండ్రి. కోర్టు అరెస్ట్ వారెంట్ పై లాయర్ తో మాట్లాడతామన్నారు.