సోనభద్ర: రేప్ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేపై అక్కడి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎనిమిదేండ్ల క్రితం మైయోర్పూర్లో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో దుద్ది అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టు ఎన్నిమార్లు నోటీసులు పంపినా ఎమ్మెల్యే కోర్టుకు హాజరుకాలేదు. దీంతో అదనపు సెషన్ జడ్జి రాహుల్ మిశ్రా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 23న ఎమ్మెల్యేను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్గవర్నమెంట్అడ్వొకేట్ వివరాల ప్రకారం.. మైయోర్‌పూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి.. నవంబర్ 4, 2014న అప్పటి గ్రామపెద్ద భర్త రామ్‌దులార్ తన సోదరిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఎంక్వైరీ చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
