గుప్తనిధుల వేటగాళ్లు అరెస్టు

 ఐదుగురు గుప్తనిధుల వేటగాళ్లను అటవీ అధికారులు అరెస్టు చేశారు. ఆత్మకూరు మండలం బైర్నూటి అటవీ ప్రాంతంలోని తిరుమలగిరి కొండపై పురాతన ఆలయం ఉంది.  అక్కడ గుప్త నిధులున్నాయని వెలుగోడు పట్టణానికి చెందిన ఐదుగురు గ్రామస్తులు ప్రయత్నించారు.  వారు ఆ ప్రాంతంలో తిరుగుతుండడాన్ని గమనించిన అటవీ అధికారులు ఆరా తీశారు.  వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో  లోతుగా విచారించగా గుప్తనిధులను తవ్వేందుకు వచ్చామని అధికారులకు తెలిపారు.  నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు రిమాండ్ కు తరలించారు.