ఆటోలు దొంగలించి పట్టుబడ్డ నిందితులు
కర్నూలు: పాతబస్తీ లోని బొంగుల బజార్ ప్రాంతంలో చోరీ చేసిన ఆటోను విక్రయించే పనిలోపడ్డ ముగ్గరు గద్వాల వాసులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈనెల 2వ తేదీన కర్నూలు బొంగుల బజార్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ చిన్న తిమ్మప్ప తన ఆటో AP 21 TU- 7762 ను ఇంటి వద్ద నిలిపి ఉంచగా ముగ్గురు నిందితులు కలసి దొంగతనం చేశారు. బాధితుడు చిన్న తిమ్మప్ప వెంటనే కర్నూలు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ కు వెళ్లి తన ఆటోను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన దొంగిలించారని ఇచ్చిన ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాల సీసీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు పాత నేరస్తులే అయి ఉండొచ్చని అనుమానించారు. పాత నేరస్తులతో నిందితుల ఆనవాళ్లను పోల్చి చూశారు. మరో వైపు చోరీ జరిగిన చుట్టుపక్కల కూడా విచారించారు. సెకండ్ హ్యాండ్ ఆటోలు అమ్మేందుకు ప్రయత్నించిన వారి గురించి సమాచారం ఇవ్వాలని పలువురు ఆటో ట్రైవర్లకు తెలియజేయగా.. వెంటనే ఆచూకీ తెలిసింది. గద్వాలకు చెందిన రాయుడు అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. బుకాయించాడు. తన ఆటో సొంతమని.. కాగితాలేవీ లేవని.. లాక్ డౌన్ లో అత్యవసర ఇబ్బందుల కారణంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నానని బుకాయించే ప్రయత్నం చేశాడు. ఆటో నెంబర్ ప్లేట్ మార్చి ఉంటాడనే అనుమానంతో వెంటనే చాసీ నెంబర్లు.. ఇంజన్ నెంబర్ల ను పరిశీలించగా దొంగలించిన ఆటో ఇదేనని తేలింది. అంతే రెడ్ హ్యాండెడ్ గా దొంగ దొరికిపోయాడు. ఇతనితో పాటు గద్వాలకు చెందిన బంగారి, నల్ల శీను అనే ఇద్లరిని కూడా అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా వారి వద్ద నుండి మరో రెండు ఆటోలు దొరికాయి. అవి కూడా చోరీ చేసినవే. AP 21 TU -3887 , AP 21 TY -4613. మొత్తం మూడు ఆటోలను నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.. నిందితులను చోరీ కేసు కింద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని కర్నూలు ఒకటవ పట్టణ సీఐ విక్రమసింహ తెలిపారు.

