- షియా మతగురువు అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనలు
న్యూఢిల్లీ : షియా మతగురువు అరెస్టుతో పాకిస్తాన్ ఆక్రమిత్ గిల్గిట్ బల్టిస్తాన్‌లో ఆందోళనలు చెలరేగాయి. దైవ దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఆఘా బాకర్ అల్ హుస్సేనీ అనే మత గురువును పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్కర్దు ప్రజలు వీధుల్లోకి వచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా నిరసనల్లో పాల్గొంటున్నారు. ‘చలో చలో.. కార్గిల్ చలో’ అంటూ నినాదాలు చేశారు. తమను భారతదేశంలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే అంతర్యుద్ధం తప్పదని గిల్గిట్ నాయకులు హెచ్చరించారు. ఆగస్టు 22 నుంచి ఈ ప్రొటెస్టులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ నిరసనలను పాకిస్తానీ మీడియా కవరేజ్ చేయలేదు. కొన్ని వీడియోలు, ఫొటోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు పాకిస్తాన్‌కు, ఆర్మీ చీఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు.
