ఆన్​లైన్​ ట్రేడింగ్ ​పేరుతో రూ.13 లక్షలకు టోకరా

  • ముగ్గురు సైబర్​నిందితుల అరెస్ట్​

సిద్దిపేట రూరల్, వెలుగు: ఆన్​లైన్​ట్రేడింగ్ ఇన్వెస్ట్​మెంట్​లో డబ్బులు పెడితే ఎక్కువ సంపాదించవచ్చని నమ్మించి మోసం చేసిన ముగ్గురు సైబర్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొన్ని రోజుల కింద బెజ్జంకి గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ కు రంగారెడ్డి జిల్లాకు చెందిన కడవెర్గు రామకృష్ణ, గంగాధర అభిషేక్, జీడిగాం ఉమాకాంత్ వాట్సాప్ లో ఒక లింక్ పంపించారు. ఇందులో పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపారు. అది నమ్మిన బాధితుడు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పది రోజుల్లో రూ. 13,12,017 లక్షలు పంపించాడు.

అనంతరం నిందితులకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో  మోసపోయానని గ్రహించి జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి వివరాలు తెలిపాడు. అలాగే ముగ్గురు నిందితులపై  సిద్దిపేట సైబర్ క్రైమ్ పీఎస్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను హైదరాబాద్ హబ్సిగూడ  వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 వేలు రికవరీ చేసి అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు.