రంజాన్​ ప్రార్థనలకు ఈద్గాలో ఏర్పాట్లు

పాలమూరు, వెలుగు: రంజాన్  సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానాన్ని మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, వైస్  చైర్మన్  షబ్బీర్  అహ్మద్, ఈద్గా కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

ఈద్గా ఆవరణలో మంచినీళ్లతో పాటు షామియానాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మైనార్టీ ఫైనాన్స్  కార్పొరేషన్  చైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, మైనారిటీ సెల్  చైర్మన్  ఫయాజ్, అవేజ్, ఫయీమ్, డీసీసీ జనరల్​ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలీ, జహీర్, ఈద్గా కమిటీ సభ్యులు తక్  హుస్సేన్, గౌస్  పాషా, ఇద్రీస్, ఖాదర్  పాషా, బేగ్  పాల్గొన్నారు.