రంజాన్ ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: రంజాన్  ప్రత్యేక ప్రార్థనల కోసం జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎండ వేడిని తట్టుకునేలా షామియానాలు ఏర్పాటు చేశామని, ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మండలంలోని కుమ్మెర, తూడుకుర్తి, పెద్దాపూర్  తదితర గ్రామాల్లో ఈద్గాలను ముస్తాబు చేస్తున్నారు.