వ్యాక్సిన్ ఇవ్వడానికి లక్ష మంది సిద్ధం

వ్యాక్సిన్ ఇవ్వడానికి లక్ష మంది సిద్ధం
న్యూఢిల్లీ: దేశంలో అతి త్వరలో వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ అవుతుందని ప్రధాని మోడీ గురువారం పేర్కొన్నారు. అందుకోసం సిబ్బందికి అవసరమైన ట్రెయినింగ్ ఇవ్వడంపై సర్కార్ ముందే దృష్టి సారించింది. వ్యాక్సిన్ ఇవ్వడానికి సుమారుగా 96 వేల పైచిలుకు సిబ్బందికి ట్రెయినింగ్ ఇచ్చింది. వ్యాక్సిన్‌‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ సిబ్బంది టీకాలు ఇవ్వడంలో నిమగ్నమవనున్నారు. దీన్ని పక్కనబెడితే.. వ్యాక్సినేషన్‌‌ కోసం అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు కేంద్రం సూచించింది. గ్రౌండ్ స్టాఫ్, ఐటీ సిస్టమ్స్‌‌తోపాటు మౌలిక సదుపాయాలను త్వరగా సమకూర్చుకోవాలని పేర్కొంది.