గురెజ్: నార్త్ కశ్మీర్ లో భారత ఆర్మీకి చెందిన ఓ విమానం కుప్పకూలింది. బందిపొరా జిల్లాలోని తులైల్ ఏరియా, గురెజ్ సెక్టార్ లో ఇవాళ మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని చెప్పారు. చాపర్ తో తమకు కమ్యూనికేషన్ లేదని.. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని గురెజ్ ఏరియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. కాగా, కూలిన హెలికాప్టర్ ను నడుపుతున్న పైలట్, కోపైలట్ సురక్షితంగా బయటపడ్డారని వార్తలు వస్తున్నాయి. అయితే వారు ఎలా ఉన్నారనే దానిపై ఆర్మీ వర్గాలు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
J-K: Indian Army helicopter crashes in Gurez sector
— ANI Digital (@ani_digital) March 11, 2022
Read @ANI Story | https://t.co/9klTCFhrxc pic.twitter.com/OxDpTqzMIV
మరిన్ని వార్తల కోసం:
