ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర నివాళ్లుర్పించారు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే. తర్వాత సౌత్ బ్లాక్ ఆవరణలో సైనిక వందనం స్వీకరించారు. ఎలాంటి ఆపరేషన్ కైనా రెడీ ఉన్నామని... త్రివిధ దళాలు కలిసి పనిచేస్తాయన్నారు మనోజ్ పాండే. భారత సైన్యానికి నాయకత్వం వహించడం తనకు గర్వకారణమన్నారు.
దేశ భద్రత, సమగ్రతను కాపాడేందుకు ముందుకె వెళ్తామని హామీ ఇచ్చారు. న్యూ టెక్నాలజీలతో పని చేసేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. సైన్యంలోని అధికారులందరికీ కెరీర్ పరంగా..వృత్తిపరమైన వృద్ధికి సమాన అవకాశం లభిస్తుందన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితి వేగంగా మారుతోందన్నారు.తమకు చాలా సవాళ్లు ఉన్నాయని.. సమన్వయంతో ఏవైనా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం సైన్యం యొక్క విధి అని అన్నారు.
#WATCH | I've known the other two Service chiefs well. It's a good beginning of synergy, cooperation& jointmanship among the three Services. I assure you that all three of us will work together&take things forward for national security & defence: Army Chief General Manoj Pande pic.twitter.com/IZ23dBVudN
— ANI (@ANI) May 1, 2022
