ఏ దాడులను ఎదుర్కొనేందుకైనా రెడీగా ఉండాలి

ఏ దాడులను ఎదుర్కొనేందుకైనా రెడీగా ఉండాలి

న్యూఢిల్లీ: శత్రువులు ఎటు నుంచి దాడులు చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భద్రతా దళాలకు ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ సింగ్ భదౌరియా సూచించారు. శత్రు దేశాల నుంచి వచ్చే బహుళ దాడులను తిప్పికొట్టేందుకు రెడీగా ఉండాలన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) 139వ కోర్సు క్యాడెట్ల పాసింగ్ ఔట్ పరేడ్‌‌లో పాల్గొన్న భదౌరియా.. రక్షణ రంగం గురించి పలు విషయాలు మాట్లాడారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్‌‌ పోస్టులను నూతనంగా ఏర్పాటు చేయడం రక్షణ రంగ సంస్కరణల్లో చారిత్రాత్మక దశ అని భదౌరియా పేర్కొన్నారు. జవాన్ల నుంచి నిబద్ధత, అంకితభావం, త్యాగాలను దేశం కోరుకుంటోందన్నారు.