నిరుద్యోగులకు గుడ్ న్యూస్: సాయుధ దళాల్లో మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్​ జాబ్స్

కేంద్ర సాయుధ దళాల్లో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఏ హోదాలో మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొలువులకు ఇండో–టిబెటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 345 పోస్టులకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. కేంద్ర సాయుధ దళాల్లో వైద్యులది ఎంతో కీలక పాత్ర. భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో కొన్ని సందర్భాల్లో గాయాలపాలవుతుంటారు. అలాంటి వారికి తక్షణం వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియమిస్తోంది.

ఖాళీలు: సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)–5 పోస్టులు,స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డిప్యూటీ కమాండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)–176 పోస్టులు, మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)–164 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు: పోస్టులను ఆధారంగా నిర్దేశిత స్పెషలైజేషన్లలో డిగ్రీ లేదా పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిప్లొమా ఉండాలి. పని అనుభవంతో పాటు ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయా­లి.

సెలెక్షన్​ ప్రాసెస్​: మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అవి.. పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూ, ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఎలాంటి రాత పరీ­క్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారా పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల భర్తీ క్రమంలో..అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థుల ఆన్​లైన్​లో నవంబర్​ 14 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ 2025 జనవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు www.recruitment.itbpolice.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.