సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

గద్వాల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు జోగులాంబ జోన్  డీఐజీ చౌహాన్  తెలిపారు. శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలో సభాస్థలి, పార్కింగ్  ప్లేస్, హెలిప్యాడ్ ను ఎస్పీ రితిరాజ్​తో కలిసి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. హైవే పక్కనే ఉండడంతో వెహికల్స్​ రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. అడిషనల్  ఎస్పీ గుణశేఖర్, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రవిబాబు ఉన్నారు.