భారత క్రికెట్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో చెలరేగాడు. రంజీ ట్రోఫీలో గోవా తరపున ఆడుతున్న అతను ఐదు వికెట్లు పడగొట్టి తొలిసారి రంజీల్లో ఈ ఫీట్ సాధించాడు. అరుణాచల్ ప్రదేశ్‌పై బుధవారం (నవంబర్ 13) గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్లో జరిగిన 5వ రౌండ్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అర్జున్ టెండూల్కర్ విజృంభించడంతో అరుణ చల్ ప్రదేశ్ కేవలం 84 పరుగులకే ఆలౌట్ అయింది.
ALSO READ | ICC men's T20I rankings: రెండే మ్యాచ్‌లు.. 110 మందిని వెనక్కి నెట్టిన మిస్టరీ స్పిన్నర్
ఇప్పటివరకు అర్జున్.. ఈ రంజీ సీజన్ లో నాలుగు మ్యాచ్‌లాడి 17.75 సగటుతో 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి మ్యాచ్ లో సిక్కింపై రెండు ఇన్నింగ్స్ ల్లో 6 వికెట్లు పడగొట్టి సీజన్ మంచిగా ప్రారంభించాడు. బ్యాటింగ్ లోనూ 42 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత మిజోరామ్తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ముగిసేసరికి గోవా 2 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ లో 330 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
FIVE-WICKET HAUL FOR ARJUN TENDULKAR...!!!!
— Johns. (@CricCrazyJohns) November 13, 2024
- Arjun Tendulkar took five wicket haul against Arunachal Pradesh in the Ranji Trophy, terrific performance by Arjun ?⚡ pic.twitter.com/ye4X08VUKO