
న్యూయార్క్: వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ ను ఇండియా గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ మిశ్రమ ఫలితాలతో ఆరంభించాడు.గురువారం రాత్రి జరిగిన ఐదు గేమ్స్‌లో నాలుగింటిలో గెలిచి ఒకదాంట్లో ఓడి తొలి రోజును సంయుక్తంగా ఐదో స్థానంతో ముగించాడు. తొలి రెండు గేమ్స్‌లో గెలిచిన అర్జున్ మూడో గేమ్‌లో అమెరికా జీఎం సామ్ సెవియన్ చేతిలో ఓడిపోయాడు. కానీ, తర్వాతి రెండు రౌండ్లలో గెలిచి మొత్తం నాలుగు పాయింట్లతో నిలిచాడు. రష్యా యంగ్‌స్టర్ వొలోడార్ ముర్జిన్ మరో ముగ్గురు 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ ఒక విజయం, రెండు డ్రాలు, ఓ ఓటమితో కేవలం 2.5 పాయింట్లతో 80వ స్థానంలో నిలవడం గమనార్హం.