Hernan Fennell: అనామక బౌలర్ అరుదైన రికార్డు.. టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్

ప్రపంచానికి క్రికెట్ పరిచయమైన తొలినాళ్లలో ఎక్కువగా బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లు కనిపించేవి. అందునా, బ్యాటర్ల వద్ద సరైన మెళుకువలు, ప్రణాళికలు అంటూ లేకపోవడటంతో టఫ టఫా వికెట్లు నేలరావేవి. హ్యాట్రిక్‌ల మీద హ్యాట్రిక్‌లు నమోదయ్యేవి. కానీ, ఇప్పుడంతా బ్యాటర్లదే ఆధిపత్యం. 

భారీ స్కోర్లు నమోదు కావడానికి ఫ్లాట్ పిచ్‌లు తయారు చేస్తుండటంతో హ్యాట్రిక్ సంగతి దేవుడెరుగు వికెట్లు తీయడమే గగనంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అడపాదడపా అటువంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఓ అనామక ఏకంగా డబుల్ హ్యాట్రిక్ తీసి వారెవ్వా అనిపించాడు.

ALSO READ | IND vs AUS 3rd Test: ఆకాష్ దీప్ ఫోర్.. పట్టరాని సంతోషంతో గంభీర్, రోహిత్, కోహ్లీ సంబరాలు

అర్జెంటీనా బౌలర్ హెర్నర్ ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజనల్ అమెరికా క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా కేమన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెన్నెల్ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. తద్వారా 36 ఏళ్ల టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఆరో బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు, టీ20 క్రికెట్‌లో బహుళ హ్యాట్రిక్‌లు సాధించిన ఆరో బౌలర్‌.. ఫెన్నెల్. ఇతను గతంలో 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ అమెరికాస్ రీజియన్ క్వాలిఫైయర్ టోర్నీలో పనామాపై హ్యాట్రిక్‌ సాధించాడు.

టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్లు

ఫెన్నెల్ కంటే ముందు టీ20ల్లో డబుల్ హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్లు ఐదుగురు ఉన్నారు.  ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ , ఐర్లాండ్‌కు చెందిన కర్టిస్ క్యాంఫర్ , వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్., లెసోతోకు చెందిన వసీమ్ యాకూబ్‌ ఈ ఘనత సాధించారు. 

ఈ మ్యాచ్‌లో చేదు విషయం ఏమిటంటే.. ఫెన్నెల్ డబుల్ హ్యాట్రిక్ సాధించినప్పటికీ, అర్జెంటీనా 22 పరుగుల తేడాతో కేమన్ ఐలాండ్స్‌తో చేతిలో ఓడిపోయింది. కేమన్ ఐలాండ్స్‌ నిర్ధేశించిన 116 పరుగుల ఛేదనలో అర్జెంటీనా 94 పరుగులకే ఆలౌటైంది.