హే రాహుల్.. ఇటలీ వెళ్లొచ్చావా?

హే రాహుల్.. ఇటలీ వెళ్లొచ్చావా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ వ్యక్తిగత విజిట్‌‌లో భాగంగా రీసెంట్‌‌గా ఇటలీ వెళ్లొచ్చారు. రాహుల్ ఇటలీ పర్యటనపై ఆమ్ ఆద్మీ పార్టీ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఇటలీలోని మిలాన్ నుంచి తిరిగొచ్చావా అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించింది. కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విషెస్ చెబుతూ రాహుల్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌‌లో తన మనసంతా ఢిల్లీలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులు, శ్రామికులతోనే ఉందని రాసుకొచ్చారు. దీనిపై ఆప్ సెటైరికల్‌‌గా ట్వీట్ చేసింది. మీరు మిలాన్ నుంచి తిరిగొస్తున్నారా అంటూ ప్రశ్నించింది. రైతులు నిరసనలు చేస్తుంటే రాహుల్ విదేశీ ట్రిప్‌‌లు వేస్తూ వారిపై సానుభూతి నటిస్తున్నారంటూ దుయ్యబట్టింది. Are you back from Milan? https://t.co/dVkBbblj5S — AAP (@AamAadmiParty) January 1, 2021 ఆప్‌‌ నేతలతోపాటు బీజేపీ నాయకులు కూడా రాహుల్ ఇటలీ పర్యటనపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు చేసుకుంటున్న వేళ రాహుల్ మాయమయ్యారని మధ్యప్రదేశ్ సీఎం శివ్‌‌రాజ్ చౌహాన్ పేర్కొన్నారు. రాహుల్ ఓ టూరిస్ట్ పొలిటీషియన్ అంటూ తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు.