సౌతాఫ్రికాలో వర్ణవివక్షపై పోరాడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు(90) ఇవాళ కన్నుమూశారు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వెల్లడించారు. విముక్తి కోసం పోరాడిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిని కోల్పోయామన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. టుటు లేని లోటు పూడ్చలేనిదన్నారు. టుటు అలుపెరగని కార్యకర్త, అతను సౌతాఫ్రికలో తెల్లజాతి మైనారిటీ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు 1984లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
The passing of Archbishop Emeritus Desmond Tutu is another chapter of bereavement in our nation’s farewell to a generation of outstanding South Africans who have bequeathed us a liberated South Africa. pic.twitter.com/vjzFb3QrNZ
— Cyril Ramaphosa ?? (@CyrilRamaphosa) December 26, 2021
