ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా ఆరట్టు మహోత్సవం

అదిలాబాద్ ఫొటోగ్రాఫర్, వెలుగు : ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఆరట్టు మహోత్సవం ప్రధాన వీధుల గుండా వైభవంగా సాగింది. మహిళలు మంగళహారతులతో ర్యాలీలో పాల్గొనగా.. అయ్యప్ప స్వాములు సాంప్రదాయ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ పల్లకిని ఊరేగించారు. అనంతరం పెన్ గంగా నదిలో అయ్యప్ప స్వామికి చక్ర తీర్థ స్నానాలు చేయించి కార్యక్రమాన్ని ముగించారు.

అంతకుముందు గోపాలకృష్ణ మఠం వద్ద ఎమ్మెల్యే పాయల్ శంకర్, మఠాధిపతి యోగానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసి ఆరట్టు మహోత్సవాన్ని ప్రారంభించారు. పల్లకి ఊరేగింపులో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.