ప్రయాణికులకు సంక్రాంతి ఆఫర్: టికెట్పై ఆర్టీసీ10 శాతం డిస్కౌంట్

సంక్రాంతి పండుగ కానుకగా APSRTC గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి పండుగకు వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా తిరుగు ప్రయాణం కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

 సంక్రాంతి రద్దీ దృష్ట్యా మొత్తం 7200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు APSRTC  ప్రకటించింది. బుధవారం (08 జనవరి 2025) నుంచి 13 తేవీ వరకు 3900 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు అధికారులు. హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. 

ALSO READ | తిరుమలలో వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు.. 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం..

పండుగ తర్వాత తిరుగు ప్రయాణం కోసం 3200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. ప్రయాణికులకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే రానూపోనూ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10శాతం రాయితీగా ఇస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది.