హైదరాబాద్,వెలుగు: అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిటీలోని మేడ్చల్ డబీర్పూర్లో అపర్ణ ఊర్వీ పేరుతో ‘ప్లాటెడ్ డెవెలప్మెంట్ ప్రాజెక్టు’ను మొదలుపెట్టింది. ఈ ఏడాది ఇది తమకు మూడో ప్రాజెక్టని తెలిపింది. మేడ్చల్ ప్రాజెక్టు 44 నంబరు హైవేను ఆనుకొని ఉంటుంది. మొత్తం 13.69 ఎకరాల్లో 136 ప్లాట్లు ఉంటాయి. ధరలు రూ.94 లక్షల నుంచి మొదలవుతాయి. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ రాకేశ్రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది తెలంగాణ, ఏపీ, బెంగళూరులో మరో నాలుగు ప్రాజెక్టులు మొదలుపెడతామని చెప్పారు.
