కొడంగల్ ​​లిఫ్ట్​ టెండర్లకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: కొడంగల్– నారాయణపేట లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్  టెండర్లకు ఆమోదముద్ర పడింది. దానితో పాటు సదర్మాట్, రాజీవ్​గాంధీ లిఫ్ట్​ స్కీమ్​ టెండర్లకూ ఆమోదం లభించింది. శనివారం నిర్వహించిన కమిటీ ఆన్​ టెండర్స్​ (సీఓటీ) సమావేశంలో ఆయా ప్రాజెక్టుల టెండర్లకు అధికారులు ఆమోదం తెలిపారు.

 రూ.4,350 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న కొడంగల్– నారాయణపేట లిఫ్ట్​ స్కీమ్  కోసం ఆగస్టులో అధికారులు టెండర్లను పిలిచారు. మొదటి ప్యాకేజీ పనులను రాఘవ కన్​స్ట్రక్షన్స్​, రెండో ప్యాకేజీ పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. సదర్మాట్​ బ్యారేజీ ఆధునీకరణ ప్రాజెక్టుకు బృందా కన్​స్ట్రక్షన్స్​, రాజీవ్​ గాంధీ లిఫ్ట్  స్కీమ్​ పనులను మరో సంస్థ దక్కించుకుంది.