కల్వకుర్తి సివిల్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదుల నియామకం

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి సీనియర్, జూనియర్ సివిల్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు నియామకమయ్యారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ రమణ తెలిపారు. సీనియర్ సివిల్ కోర్టులో వెంకటరెడ్డి, జూనియర్ సివిల్ కోర్టులో లక్ష్మణ్ రాజులపే ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించారని చెప్పారు. ఈ సందర్భంగా వారిని కల్వకుర్తి న్యాయవాదులు సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటేశ్వరరావు, అమరేందర్, చిందెం కృష్ణయ్య, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్, నరేందర్ రెడ్డి, మల్లేశ్, రాంగోపాల్, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.