నిర్మలా సీతారామన్ పై చిదంబరం సెటైరికల్ కామెంట్స్

నిర్మలా సీతారామన్ పై చిదంబరం సెటైరికల్ కామెంట్స్

కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై తీవ్ర విమర్శలు చేశారు. సొంత నైపుణ్యాలు వదులుకొని గ్రహాలపై ఆశలు పెంచుకుంటున్నారన్నారు. శక్తివంతమైన స్పేస్ టెలిస్కోప్  ద్వారా నాసా రిలీజ్ చేసిన ఫొటోలను నిర్మలా సీతారామన్ రీట్వీట్ చేసిన అనంతరం చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. 7.01 శాతం ద్రవ్యోల్భణం,7.8 శాతం నిరుద్యోగిత రేటుగా వెలువడిన రోజునే ఆర్థిక మంత్రి బృహస్పతి, ప్లూటో, యురేనస్ గ్రహాల చిత్రాలను ట్వీట్ చేయడం మాకు అంతగా ఆశ్చర్యం కలిగించలేద’ ని చిదంబరం సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ‘ఆమె తన సొంత నైపుణ్యాలపై, ఆర్థిక సలహాదారుల నైపుణ్యాలపై ఆశలు వదులుకున్నారని, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు గ్రహాలను ఆశ్రయించార’ ని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అంతే కాదు కొత్త సీఈఏ: చీఫ్ ఎకానమిక్ ఆస్ట్రాలజర్‌ను నియమించాలని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయడం మీద కంటే ఆర్థిక మంత్రి సీతారామన్‌కు యురేనస్, ప్లూటో గ్రహాలపైనే ఎక్కువ ఆసక్తి ఉందని విమర్శలు చేశారు.