ఓయూ డిస్టెన్స్​ ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు అడ్మిషన్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జి.రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2024–25 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్​ విధానంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: ఎంబీఏ కోర్సుకు ఏదైనా గ్రాడ్యుయేట్; ఎంసీఏ కోర్సుకు గణితం సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ ఆధారంగా సీటు కేటాయిస్తారు. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ ఏపీ ఐసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో నేరుగా ప్రవేశం పొందవచ్చు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో నవంబర్​ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.900 చెల్లించాలి. ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ నవంబర్ 9న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.oucde.net వెబ్​సైట్​లో సంప్రదించాలి.