ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి : ఉచితంగా ఐఫోన్ కావాలంటే

ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి : ఉచితంగా ఐఫోన్ కావాలంటే

యాపిల్ సంస్థ ఐఫోన్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. అయితే ఐఫోన్ సొంతం చేసుకోవాలంటే యాపిల్ సంస్థ నిర్వ‌హించే టెస్ట్ ల్లో విజ‌యం సాధించాల్సి ఉంది.
యాపిల్ ఐఫోన్ లేదా ఐఓఎస్ లో బ‌గ్స్ ను క‌నిపెట్టేందుకు సెక్యూరిటీ రీసెర్చ్ డివైజ్ అనే ప్రోగ్రామ్ తో ముందుకు వ‌చ్చింది. ఈ ఫోగ్రామ్ లో బ‌గ్స్ ను క‌నిపెట్టేందుకు హ్యాక‌ర్స్ ను ఎంపిక చేసుకోనుంది.

సంవత్స‌రం పాటు జ‌రిగే ఈ పోగ్రామ్ లో యాపిల్ సంస్థ ఎంపిక చేసిన హ్యాక‌ర్స్ కు ఉచితంగా ఐఫోన్ ను అదిస్తుంది. ఈ ఐఫోన్ వినియోగించే స‌మ‌యంలో ద‌శ‌ల వారీగా బ‌గ్స్ ను గుర్తించాలి. మొద‌టి, రెండు ద‌శ‌ల్లో బ‌గ్స్ కొన‌సాగితే మూడో ద‌శ‌కు టీమ్ కు అందిస్తారు. మూడో ద‌శ రీసెర్చ్ లో పాల్గొన్న హ్యాక‌ర్స్ బ‌గ్స్ ఉన్న‌ట్లు గుర్తిస్తే..వాటిని స‌వ‌రిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో బ‌గ్స్ ను క‌నిపెట్టిన హ్యాక‌ర్స్ కు ఆపిల్ సెక్యూరిటీ బౌంటీ ద్వారా పెద్ద‌మొత్తంలో ప్రైజ్ మ‌నీని అందిస్తుంది.

రీసెర్చ్ కోసం హ్యాక‌ర్స్ ను ఎంపిక చేసుకోనుంది. సంబంధిత వివ‌రాలు కావాలంటే యాపిల్ వెబ్ సైట్ ను విజిట్ చేయాల‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. కాగా ఎస్ ఆర్డీ రీసెర్చ్ పోగ్రామ్ 2021నుంచి ప్రారంభం కానుంది.