iphone 16 series :ఐ ఫోన్ 16 సిరీస్‌ ఫస్ట్ లుక్ రిలీజ్.. యాపిల్ లోగో, కెమెరా డిజైన్ మాయమైంది

ఐ ఫోన్‌కు ఉండే రేంజే వేరు.. ధర ఎంతైనా పర్లేదు.. ఏ వేరియంట్ మార్కె్ట్ లోకి వచ్చినా ఆ బ్రాండ్ ఫోన్లు జనం తెగ కొనేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఐఫోన్ లో 15 సిరీస్ మాత్రమే ఉండేది. తర్వరలో 16 సిరీస్ లో ప్లస్, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లను తీసుకురానుంది. 16 ఐఫోన్ కొత్త మోడల్ ఫోన్ 16 సిరీస్ ను వచ్చే నెల సెప్టెంబర్ లో లాంచ్ చేయనున్నట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది. శుక్రవారం 16 సిరీస్ వేరియంట్ కలర్స్, డిజైన్స్ మార్చి ఉన్న ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ 16 సిరీస్ లో యాపిల్ పూర్తిగా డిజైన్ మార్చేసింది. కెమోరా డిజైన్, ఫోన్ వెనుక యాపిల్ లోగో మాయమైంది. 

ఐఫోన్ 16 రీడిజైన్ ఫోన్ హీట్ కాకుండా కొత్త టెక్నాలజీను ఉపయోగించామని కంపెనీ తెలిపింది. అంతేకాదు ఫాస్ట్ ఛార్జింగ్, AI టూల్స్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయని చెప్తోంది. ఐఫోన్ 16 వైట్, బ్లాక్, బ్లూ, గ్రీన్ మరియు పింక్ 5 కలర్స్ లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Appleలో ఫస్ట్ టైం కొత్త తరం చిప్ సిరీస్ AI- తీసుకురాన్నున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా బయట వార్తలు వినిపిస్తున్నాయి.